వ్యవసాయ ఎగుమతుల్లో.....
తెలంగాణలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు ఏటేటా పెరుగుతున్నాయి గత ఆర్థిక సంవత్సరంలో రూ.7737 కోట్లకు చేరాయి. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహంతో పాటు ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ద్వారా ఈ పురోగతి సాధించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయకంగా రాష్ట్రంలో ఉత్పత్తులు పెరుగుతున్నాయి వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో స్థూల రాష్ట్ర విలువ గణనీయంగా పెరిగింది. పంట ఉత్పత్తుల శుద్ధి ద్వారా అదనపు విలువను కల్పించడం ద్వారా రైతుల ఆదాయం పెంచాలని ప్రభుత్వం భావించింది ఈ మేరకు ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటును పెద్ద ఎత్తున చేపట్టింది ఎగుమతులకు అనువైన వనరులు మౌలిక సదుపాయాలను కల్పించింది గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణం చేపట్టింది. ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ప్రత్యేక విధానం చేపట్టింది దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆహార శుద్ధి ప్రత్యేకంగా మండలను చేపట్టింది ప్రత్యేక మండలను. గత కొంతకాలంగా పత్తికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది జౌలి ఉత్పత్తులతో పాటు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కోసం పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు దీంతో పత్తి ఎగుమతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆరోగ్య సంరక్షణలో భాగంగా బియ్యం జొన్నలు, గోధుమలు తదితర తృణధాన్యాలకు ఇతర దేశాల్లో ఆదరణ ఉంది కాఫీ, టీ, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర మిరియాలు ఎగుమతుల ఆర్డర్లు పెరుగుతున్నాయి,. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఆహార శుద్ధి ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేసిన పక్షంలో అక్కడి నుంచి ఎగుమతులు విస్తరిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.