దేశంలో అత్యధిక రుణభారం...
దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతులపైనే అత్యధిక రుణమాల ఉంది జాతీయ స్థాయిలో సగటున ఒక్కో రైతు కుటుంబం పై రూ. 74 వేల రూపాయల రూపాయి ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది రెండు రూ. 2,45,454 చొప్పున ఉంది. ఇది దేశంలో ఒక్కో రైతు కుటుంబం కోసం రుణభారం కంటే 231% అధికంగా ఉంది ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ ఖరాట్ సోమవారం లోక్సభలో తెలిపారు. రైతులు అత్యధికంగా రుణభారం మోస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ టాప్ లో నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే రైతు కుటుంబాలపై సగటున రుణభారం రూ. రెండు లక్షలకు మించింది హర్యానా, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ మరియు తమిళనాడులో రైతు కుటుంబాలపై రూ. లక్షకు పైగా రుణభారం ఉంది. మిగతా రాష్ట్రాల్లో రైతులపై సగటుబారం రూపాయల లక్ష లోపే నమోదయింది.