16 Feb , 2023

అడుగంటుతున్న జలాశయాలు...

వరంగల్ జిల్లాలో యాసంగి వరి నాటు పూర్తయ్యాయి మరో రెండు మాసాలపాటు పొలాలకు నిత్యంతడులు అవసరం జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకంలో నిర్మించిన జలాశయాలు అడుగంటుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి ఊట బోర్లు రోజు విడిచి రోజు వినియోగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితులలో జిల్లాలోని భారీ చిన్ననీటి జలాశయాల దిక్కు దేవాదుల జలాశయాల్లో నీరు నిండుకుంటుంది. మరోపక్షం రోజుల్లో ధర్మసాగర్ నుంచి నీటి సరఫరా జరగని పక్షంలో ఇవి పూర్తిగా అడుగంటే పరిస్థితులు ఉన్నాయి. ధర్మసాగర్ కు వచ్చే పైపులైను పులకుర్తి చలివాగు తదితర ప్రాంతాల్లో గత వర్షాకాలం పలుచోట్ల పైకి తేలడంతో ఎత్తిపోతల నిలిచిపోయింది. ఏడాదిలో 170 రోజులు ఎత్తిపోతల జరగాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాలతో ఎత్తిపోతల్లో అంతరాయం ఏర్పడింది ములుగు, ధర్మసాగర్, చలివాగు ధర్మసాగర్ మధ్యలో పైప్ లైన్ మరమత్తులు పూర్తిచేసి నాలుగున ధర్మసాగర్ కు నీటిని విడుదల చేశారు. వరంగల్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టారు ఇదే సమయంలో అటు గండి రామవరం ఇటు ఆర్ఎస్ ఘన్పూర్ జలాశలకు నీటి సరఫరా ప్రారంభం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.