పురుగుమందుల పై నోటిఫికషన్ జారి చేసిన ప్రభుత్వం
పురుగు మందుల వినియోగం పై కేంద్ర ప్రభుత్వం అంక్షలను విదించాలని నిర్ణయిచింది. ఇందులో రైతులు తరచుగా వాడే కార్బోఫ్యురాన్, మోనోక్రోటఫాస్ ,మంకోజేబ్, క్వినాల్ఫాస్ , డైమీథేట్ , క్లోరోపైరిఫాస్ , ఆక్సిఫ్లోరోఫిన్,మాలాథియాన్ ,తాము నిర్దేశించిన పంటలకు ఉపయోగించకూడదు అని నిబందిచింది.ఈ మేరకు లేబుల్ ,లిఫెలేట్ లతో నిర్దేశించిన పంటలను తొలగించాలని , వీటి జీవ సామర్థ్యం ,అవశేషా సమచారాన్ని పరిగణలోకి తీసుకున్న తరువాత ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు కార్బోఫ్యురాన్: 3 % గుళికలు మినహా మిగతా అన్నిరకాల ఫోర్ములషన్ వినియోగాన్ని ఆపివేయాలని .క్రాప్ లేబుల్ నిలిపేయాలి . మోనోక్రోటఫాస్: నీటిలో కరిగే 15% గుళికలు మినహా ఈ పురుగుమందుకు సంబందిత మిగః అన్ని ఫోర్ములశాన్లను ఆపివేయాలి. డైమీథేట్: ముడి ఆహారంగా తీసుకునే పండ్ల ,కూరగాయలకు దిన్ని ఉపయోగించకూడదు . క్లోరోపైరిఫాస్: రేగు ,సిట్రస్ ,పొగాకు పంటలకు వాడవద్దు . ఆక్సిఫ్లోరోఫిన్:ఆలు, వేరుశనగకు వాడరాదు . మంకోజేబ్: జామ ,జొన్న ,కర్రేపెందల పంటల్లో వాడరాదు. మాలాథియాన్: జొన్నలు ,శనగ , సోయబిన్ , ఆముదం , వంగ ,బెండ ,ద్రాక్ష ,కాలిఫ్లోవర్ ,మామిడి ,ముల్లంగి ,యాపిల్ ,పొద్దుతిరుగుడు ,టమాటో,పంటలకు వాడవద్దు. క్వినాల్ఫాస్: జనపనార ,యాలకులు ,జోన్నలకు వాడకూడదు . ఈ మందుల తయారీదారులు ఇక పై పైన తెలిపిన పంటల వివరాలు లేబుల్ నుండి తొలగించాలి అని సెంట్రల్ ఇంసేక్టిసైడ్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ సేక్రటరికి ఆరునెలలలోపు దరకాస్తు చేసుకోమని, లేదంటే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించింది. వీటి దిగుమతి, తయారి, ఫోర్ములషన్, రవాణా, అమ్మకాలన్నిటికీ తుది నోటిఫికషన్ నేటి నుండి నిలిపి వెయలన్నట్లు పేర్కొన్నది.