🔸 కుసుమ నూనెతో కలిగే ప్రయోజనాలు
పండించే కుసుమ పంటను ప్రస్తుతం ఔషధాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. పూర్వం రోజుల్లో వంటలకు రంగు తీసుకురావడం కోసం ఈ విత్తనాలను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వీటి నుంచి నూనె తీసి వంటలకు వాడుతున్నారు. కుసుమ నూనెలో పోషకాలు పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను చూపుతున్నదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. కుసుమ నూనెలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కుసుమ నూనెలో మెగ్నీషియం, భాస్వరం, మాంగనీస్, జింక్, ఇనుము, రాగి, ప్రొటీన్ ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల కుసుమ నూనెలో కొవ్వులు 38 గ్రాములు, సోడియం 3 గ్రాములు, పొటాషియం 687మిల్లి గ్రాములు, కార్బొహైడ్రేట్స్ 34 గ్రాములు, ప్రొటీన్ 16 గ్రాములు, విటమిన్ బీ12 88 శాతం ఉంటుంది, కుసుమ గింజల నుంచి తీసే మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్.. రెండు రకాల నూనెలను వంటల తయారీకి, కూరల వేపుళ్లకు వాడొచ్చు. ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కీళ్ల నొప్పులు తగ్గించడం, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడం, చర్మం, జుట్టు నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కుసుమనూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. స్ట్రోకులు రాకుండా నియంత్రిస్తుంది. ఈ నూనెలో యాంటిఆక్సిడెంట్స్ ఉండిగుండెకు మేలు చేకూరుస్తాయి. ఈ నూనె వాడటం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది