పనసకి గిరాకీ
విహహాది శుభకార్యాలు, విందుల్లో లేత పనస కాయలను కూరగా, వేపుళ్లు, పచ్చడిగా , బిర్యానీలు తయారు చేస్తుండంటంతో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందని సాగుదారులు చేబుతున్నారు. ఎరువులు , మందులు లేనీ ఈ పంటకు కిలో 5 నుంచి 10 రూపాయల వరకు ధర దక్కుతుందని చింతపల్లి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ పంటలతో పోలిస్తే ఈ పంట సాగు లాభాదయకంగా ఉందంటున్నారు.