వ్యవసాయంలో తెలుగు రాష్ట్రాలు..
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ వ్యవసాయ రంగం సైతం మెరుగైన వృద్ధిరేటును కనబరుస్తోంది.తాజాగా స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ గణాంకాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తులు ఏడాదికేడాది భారీగా పెరుగుతున్నాయి. ఏడేళ్లనాటి పరిస్థితులతో పోల్చుకుంటే రెట్టింపుకంటే ఎక్కువగా తెలంగాణ రికార్డులు సృష్టించింది. 2014-15తో పోలిస్తే 2021-22నాటికి తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరుని పరిశీలించిన వ్యవసాయ ఆర్థికవేత్తలు దీనిని ప్రచురించారు. సగటున 8.6 శాతం స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(GSDP)తో దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందని అందులో ప్రకటించారు. యావరేజ్ GSDP 8.9 శాతంతో గుజరాత్ అగ్రస్థానంలో, 8.7 శాతంతో ఉత్తరాఖండ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. 8.6 శాతంతో తెలంగాణ తదనంతర స్థానంలో కొనసాగుతోందని నివేదిక స్పష్టం చేసింది.