02 Mar , 2023

అతిపెద్ద “కిసాన్ ఆగ్రి షో”

భారతదేశంలోనే అతిపెద్ద “కిసాన్ ఆగ్రి షో” హైదరాబాద్లో జరగనున్నది. ఈ ఎగ్జిబిషన్ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రంగంలోని ఇన్వెస్టర్లు, రైతులకు, స్టార్టప్ సంస్థలకు ఈ షో ఎంతో ఉపయోగపడింది. ఈ కిసాన్ ఎగ్జిబిషన్లో రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రంగంలో కొత్తగా వచ్చిన మార్పులు, నీటి నిర్వహణ, పరికరాలు, వాడే పద్ధతులు, విత్తనాలు, ప్లాంటింగ్ మెటీరియల్ భారతీయ వ్యవసాయ, వాతావరణ పరిస్థితులకు అవసరమైన ఎన్నో నూతన సాంకేతికత వివిధ విషయాల గురించి ఈ ఎగ్జిబిషన్లో తెలుసుకోవచ్చు అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి ‘‘కిసాన్’’ ఆగ్రి షోలో 160కి పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనుండగా, వ్యవసాయ రంగంలోని స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహం అందించే ‘‘స్పార్క్’’ ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ 20 స్టార్టప్ సంస్థలు అధునాతన సాంకేతికలు, వినూత్న ఆలోచనలతో ఇక్కడ ప్రదర్శిస్తాయి మరియు కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐకార్ సంస్థలు కూడా ప్రదర్శనశాలను జ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయనున్నాయి. 32వసారి నిర్వహించబడుతున్న.‘‘కిసాన్” ఆగ్రి షోలో 30 వేల మందికి పైగా విజిటర్లు వచ్చే అవకాశం ఉందని అంచనా ఉంది . 12 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రైతులు హాజరై ఉపయోగించుకోవలసిందిగా కోరుకుంటున్నాము.. Jai kisan👳🌾