ఈ ఏడాది చింతపండు గురించి మరిచిపోవల్సిందేనా!!
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపు లేదు. చింత పువ్వు దశలో ఈదురుగాలులు, వర్షాలు అధికంగా కురవడంతో ఆ ప్రభావం పంటపై పడింది. చాలాచోట్ల ఇదే పరిస్థితి. వాస్థవంగా ఏటా జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, కొమరాడ, పాచిపెంట ప్రాంతాల్లో 5 వేల క్వింటాళ్ళు, సీతం పేట మన్యంలో ఏటా రెండు వేల క్వింటాల్ల వరకు చింతపండు దిగుబడి వస్తుంది.సాదారణంగా మన్యంలో చింతపండుకు మంచి డిమాండ్ ఉంది. గత ఏడాది చింతపండు నిల్వలు ఎక్కువగా ఉండడంతో కొనుగోలుకు మొగ్గు చూపలేదు. అయితే ఈ ఏడాది చింతపండు ధర మరింత ప్రియంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశపడ్డారు.కానీ ఆశించిన దిగుబడి లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.