వేల ఎకరాల పంట నష్టం
వడగళ్ల వానతో మొక్కజొన్న, బీర, టమాట, బొబ్బర, మిరప, గులాబీ, ఉల్లి మరియు కొన్ని పొట్ట దశ వచ్చిన వరి నేల వాలింది. మామిడి పిందేలు, కాయలు రాలి తీవ్ర నష్టం వచ్చిందని రైతులు బాధపడుతున్నారు. ఆరు జిల్లాల్లో సుమారుగా 50 మండలాల్లోని 650 గ్రామాల్లో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో వడగళ్లతో పంట పొలాలన్నీ మంచుతో నిండిపోయాయి. పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీనితోపాటు సంగారెడ్డి, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగురు జిల్లాలోనూ పలుచోట్ల వడగళ్ల వానతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి.