29 Mar , 2023

వాణిజ్య పంటగా వెదురు సాగు

అటవీ జాతికి చెందిన వెదురు బొంగు పంటను 2017 తర్వాత వ్యవసాయ పంటగా గుర్తించి మిషన్ బంబూ పేరుతో రైతులకు మొక్కల పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో రైతులు వెదురు సాగు చేస్తున్నారు. ఎకరాకు 800 నుంచి 1000 మొక్కలు వరకు నాటుకోవచ్చని, నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడులు మొదలైతాయని, ఇలా నాటిన దాదాపు 50 సంవత్సరాల వరకు దిగుబడులు వస్తాయని వ్యవసాయ, ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ఇటివల నిర్మల్ జిల్లా, ముథోల్ పరిసర ప్రాంతాల్లో వెదురు సాగుచేసే రైతులతో హార్టికల్చర్ ఆఫీసర్ శ్యామ్ రావు రాథోడ్ సమీక్షించి సలహాలు, సూచనలు అందించారు.