10 రూపాయలకే భూసార పరిక్ష
7 సంవత్సరాలు పూర్తై 8 సంవత్సరంలో అడుగుపెట్టిన భూసార పరిక్ష ఫథకం. సాయిల్ హెల్త్ కార్డ్ పథకం 2015 ఫిబ్రవరి 19న రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. గత 7 ఏళ్ల వ్యవధిలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ 23 కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 వేల 531 కొత్త భూసార పరీక్ష ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. మట్టి పరిక్షల వల్ల రైతులు తమ పొలాల్లోని మట్టిలో ఉన్న పోషకాలోపాలు, పిహెచ్ స్థాయి, సేంద్రియకర్బనం వంటి వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో అనవసరపు ఎరువుల ఖర్చులు తగ్గటంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. ఇప్పటకైనా అందరూ రైతులు మట్టి సామార్దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని, కేవలం 10 రూపాయలకే పరిక్ష చేసి భూసార కార్డులను సైతం అందిస్తున్నామని సాయిల్ హెల్త్ ల్యాబ్ అధికారులు చెబుతున్నారు.