మళ్ళీ రైతులకి వడగండ్ల వాన!!
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నుండి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో గాలితో పాటు వడగళ్ల వాన కూడా వచ్చే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోత సమయం కావడంతో రైతులు తీవ్ర ఆందోళకు గురువవుతున్నారు. రానున్న నాలుగు రోజుల పాటు మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి అని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులను ఈ వాన భయపెడుతుంది, కోతకు సిద్ధంగా ఉన్న వరి మరియు మామిడి పంటల్లో నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కావున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.