మిరప క్వింటాలుకు రూ.20 వేలు
ఈ ఏడాది ఆహార పంటలతో పొల్చితే వాణిజ్య పంటలు సాగుచేసే రైతులకు మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. పత్తి మార్కెట్ ఆరంభంలో 10 వేల వరకు పలుకగా, ఇప్పుడు మిరప పంటకు 20నుంచి 22 వేల వరకు క్వింటాకు పలుకుతుంది. మహారాష్ట్రలోని నాగపూర్ లో అత్యధికంగా పలుకుతుండటంతో వ్యయప్రయాసాలకు ఓర్చి పక్కనే ఉన్న ఖమ్మం, ఆదిలాబాద్ రైతులు అక్కడికి మిరప పంటను తీసుకేళ్తున్నారు. మన దగ్గరి వ్యవసాయ మార్కెట్లలోనూ ఇదే ధరలు పలికితే తమకి రవాణా ఛార్జీలు ఆదా అవుతాయని రైతుల భావిస్తున్నారు.