19 Apr , 2023

తగ్గుతున్న పాల ఉత్పత్తి

పెరుగుతున్న పాడి ఖర్చులు, 40 డిగ్రీలు దాటుతున్న ఉష్టోగ్రతలు, విజృంభిస్తున్న వింత వ్యాధులతో పాలు ఉత్పత్తి తగ్గుతుంది. గతేడాది 221 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో ప్రపంచంలో మొదటి స్ఖానంలో ఉన్నప్పటికి ఈ ఏడాది మొదటి ఉత్పత్తి భారీగా పడిపోయింది. మేత ఖర్చులు భారీగా పెరగడం, లాంఫీ వంటి చర్మ వ్యాధి సోకి దేశంలో చాల వరకు పశువులు మరణించాయి ఇదికూడా పాల ఉత్పత్తి తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. అయినప్పటికి విదేశాల నుండి పాల దిగుమతి చేసుకోబోమని దేశంలోనే పాలకు సంబందించిన ఉపఉత్పత్తులను ఉత్పత్తి చేస్తామని కేంద్ర జంతు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు .