పెరుగుతున్న యాసంగీ పత్తి సాగు
ఖరీఫ్ సీజన్ అనగా జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో పత్తి విత్తనాలు నాటడం అనావాయితి. అయితే ఇటివల నల్గొండ, ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు రైతులు యాసంగీ పత్తి సాగు చేస్తున్నారు. ముందుగా పత్తి విత్తనాలు నాటడం కొద్దిగా కష్టమైనప్పటికి కలుపు సమస్య, తెగుళ్ల సమస్య తక్కువ ఉంటుందని రైతులు బావిస్తున్నారు. ఎకరాకు ఎక్కువ మోతాదులో విత్తనాలు నాటి ప్రతి చెట్టుకు 40 పైచీలుకు కాయలు కాసేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇలా ప్రయోగత్మకంగా చేస్తున్న సాగు ఫలితాలనిస్తే రానున్న రోజుల్లో యాసంగీ పత్తి జోరందుకుంటుంది.