మక్కకు దిక్కేది
యాసంగి మక్క పంట చేతికొచ్చింది. ట్రక్కుల్లో ఎత్తుకొని మార్కెట్లోకి వెళ్లారు. కానీ కొనేవారు కానరాక ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మద్ధతు ధర లేక అందినకాడికి దళారులు ఇచ్చి తీసుకెళ్తున్నారని నిర్మల్ రైతులు వాపోతున్నారు. క్వింటా 1700 కి మించి చెల్లించడంలేదని, మార్చి చివర్లో 2200 వరకు పలికిందని రైతులు తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం దృష్టీసారించి మద్ధతుధర చెల్లించి కొనుగోలు జరిగేటట్లు చూడాలని రైతులు కోరుకుంటున్నారు.