పాత పంటల జాతర
విశాఖ జిల్లా అరకు ప్రాంతంలోని డుంబ్రిగుడ మండలం కిల్లోగూడలో సంజీవని సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ సహకారంతో ఈ నెల 28- 29 తేదిల్లో జరగనుంది.ప్రకృతి వ్యవసాయనికి పట్టుకొమ్మ అయిన పాత పంటల విత్తనాల వైవిధ్యాన్ని ప్రతి ఏటా వినియోగిస్తూ పరిరక్షించుకొవటమే ఈ 15 వ పాత పంటల జాతర ముఖ్య ఉద్దేశ్యమని సంజీవని వ్యవస్థాపకులు దివుళ్లు పచారి గారు తెలిపారు. రైతులు అనాదిగా సాగు చేస్తున్న చిరుధాన్యలు, పప్పు ధాన్యలు , నూనె గింజలు, కూరగాయలతో పాటు దేశీ వరి రకాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున్న పాల్గొని, సేంద్రియ సాగుకు ఎక్కువ మంది రైతులు మళ్లేలా ప్రోత్సహించాలి.