28 Apr , 2023

ఆకాల వర్షాలు - రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

రాబోయే 5 రోజుల వరకు తెలంగాణాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో మరియు వడగళ్ళతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారి చేసింది. 1. రైతులు చెట్లకింద విద్యుత్ స్థంభాల, తీగలు మరియు చెరువుల వద్ద ఉండకుండా మరియు పశువులను సురక్షిత ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. 2. పోలాల నుండి అధిక వాన నీటిని బయటకు పోవడానికి మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. 3. కోసిన పంటను తొందరగా సురక్షిత ప్రదేశానికి తరలించాలి. మార్కెట్ కి తరలించిన ధాన్యాన్ని తడవకుండా టార్పాలిన్ తో కప్పి ఉంచాలి. 4. పంట కోతకు సిద్దంగా ఉన్నటువంటి రైతులు రాబోవు మూడు రోజుల వరకు కోతలను మరియు పంటలలో రసాయన మందులు పిచికారీ చేసుకోకుండా వాయిదా వేసుకోవాలి.