అన్ని రకాల మొక్కలు లభించును
హైదరాబాద్ కి 50 కిలో మీటర్ దూరంలో ఉన్న సంగారెడ్డి నర్సరీలో ఎలాంటి రకమైన మొక్కలు కావాలన్నా అన్ని కాలాలలో పండించే పండ్లు , పూల , ఔషధ మరియు అన్ని రకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఉన్న పండ్ల పరిశోధన కేంద్రం దేశంలో కొత్త రకాల వంగడాలను సృష్టిచడంలో ఇక్కడి సైంటిస్ట్ లో ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం మొక్కల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మొక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. పండ్ల పరిశోధన కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్న రైతులు స్వయం ఉపాధి ద్వారా పెద్దాపూర్, తిమ్మాపూర్ గ్రామాలలో 300 పైగా నర్సరీలను నడుపుతున్నారు. ఎలాంటి రకమైన పండ్ల మొక్కలైనా ఇక్కడి నర్సరీ ల నుండి ముందుగానే ఆర్డర్ ఇచ్చి తెప్పించు కోవచ్చు. ఇక్కడి నర్సరీ నిర్వాహకులు శాస్త్రీయ పద్దతులు పాటిస్తూ దేశం మొత్తం మొక్కలు అందిస్తున్నారు. వ్యసాయానికే కాకుండా హోమ్ గార్డెనింగ్, రూఫ్ గార్డనింగ్ కోసం కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.