ఈ రకం వరి సాగు చేయవద్దని ఆదేశాలు
మహబూబాబాద్ జిల్లా 2023 – 24 ఖరీఫ్ పంట కాలంలో వరి రకం 1001 రైతులు సాగు చేయవద్దని జిల్లా కలెక్టర్ కె .శశాంక్ జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. దీనికి కారణం - 1001 వరి దొడ్డు రకం వలన రా రైస్ క్వింటాకు 70 శాతం రావడం లేదని జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంఘం వాపోతున్నారు. అలాగే. దీని వలన తాము తీవ్రంగా నష్ట పోతున్నట్లు రైస్ మిల్లర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమీక్షించిన కలెక్టర్ వరి రకం 1001 ను సాగు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.