డ్రైవర్ లెస్ ట్రాక్టర్ సూపర్
డైవర్ లేని కార్లను ఇప్పుడిప్పుడే వింటున్న తరుణంలో ఇదే తరహా ట్రాక్టర్ నీ ఆవిష్కరించారు వరంగల్ జిల్లా కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రోఫెసర్లు. పి. నిరంజన్ రెడ్డి, మహ్మద్ వసీం ఇద్దరు ప్రొఫెసర్లు రైతులు ఉపయోగించే ట్రాక్టర్ నీ డ్రైవర్ లేకుండా పొలం గట్టుపైన కూర్చొని రిమోట్ ఆధారంగా అన్ని రకాల పనులు చేసుకునేలా రూపోందించారు. దిని ధర 20 వేల వరకు ఉంటుందని, దీనికోసం ప్రత్యేక శిక్షణ అవసరం లేదని ఎవరైనా వినియోగించవచ్చని తెలిపారు. స్మాట్ ఆగ్రికల్చర్ ట్రాక్టర్ గా దినికి నామాకరణం చేశామని,ఈ టెక్నాలజిపైనా పేటేంట్ కూడా తీసుకుంటామని, అనతంరం ఐవోటీ కిట్ రూపంలో మార్కెట్లోకి విడుదలవుతుందన్నారు.