ఎరువుల ధరలు యాథాతథం
ఈ ఏడాది ఎరువుల ధరలు పెంచేది లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాత ధరల ప్రకారం కేంద్ర కేబినెట్ రూ. 1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీకి ఆమోదం తెలిపింది. ఇందులో యూరియాకు 70 వేల కోట్లు, డీఏపీకి 38 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. సకాలంలో ఎరువులు అందించడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు వాటి భారం రైతులపై పడకుండా ఈ నిర్ణయం తీసు కున్నట్లు కేంద్ర మంత్రి మనస్సుఖ్ మాండవియా తెలిపారు.