వేసవిలో వాటర్ ఆపిల్ వారెవ,.
యాపిల్ అనగానే అందరికి గుర్తోచ్చే కాశ్మీర్, సిమ్లా పండ్లే. కానీ వాటర్ యాపిల్ అంటూ ఇటీవల మార్కెట్లో వినిపిస్తుంది. ఈ వాటర్ యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎరుపు, తెలుపు రంగులో బిన్నమైన రూపంతో ఉండే ఈ పండు వేసవిలోనే దిగుబడి వస్తుంది. ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ ఎ లాంటి చాలా రకాల పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. వాటర్ ఆపిల్ తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.