సోలార్ పవర్డ్ ఆగ్రో వెహికల్
సాగులో సన్న, చిన్న కారు రైతులు యంత్రాలపై ఎక్కువ పెట్టుబడులు పెట్టలేక పాత పద్దతులు పాటిస్తున్నారు. అయితే సాగులో తన శక్తీ తానే తయారుచేసుకునేలా సౌరశక్తీతో నడిచే యంత్రాన్ని న్యూఢిల్లీలోని ఆమైటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న సుహానీ చౌహాన్ ఢిల్లీ ప్రగతి భవన్‌లో ఇటీవల జరిగిన టెక్ ప్రదర్శనల సోలార్ పవర్డ్ ఆగ్రో వెహికల్ (ఎస్‌వో-ఏపీటీ)ను తయారుచేశారు. ఈ యంత్రం ద్వారా భూమి చదును చేయటం, విత్తనాలు నాటడం, ఇతర పనుల్లో ఈ వాహనం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పర్యావరణహితమైందేగాక, నిర్వహణ ఖర్చులు కూడా ఉండవన్నారు.