తెలుగు రాష్ట్రాలలో మళ్ళి వర్షాలు..
రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు. పగటి ఉష్ణోగ్రతలు 41 నుండి 43 oC మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుండి 26 oC మధ్య, గాలిలో తేమ ఉదయం పూట 68-75 శాతం, మధ్యాహ్నం పూట 44 - 70 శాతం నమోదు కావొచ్చునని వాతావరణ కేంద్రం తెలిపింది. కావున పంటలు తడవకుండా టార్పలిన్ పట్టాలను కప్పాలి, పంట కోతలను వచ్చే వారానికి వాయుద వేసుకోవాలి, కోసిన పంటలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి మరియు యూరియా బస్తాలు తడవకుండా భద్రపరుచుకోవాలి, మామిడి కాయలు రాలి నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వానలను ఆసరా చేసుకొని లోతు దుక్కులు చేసుకోవడం మంచిదని వ్యవసాయ శాఖా తెలిపింది.