రేపే విత్తన మేళా ప్రారంభం
ఈనెల 24న హైదరాబాద్. రాజేంద్రనగర్ లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, జగిత్యాల, పాలెం, వరంగల్ లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో (కేవీకే) విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాల పరిశోధన సంచాలకులు డా. వెంకటరమణ సోమవారం తెలిపారు. పరిధిలోని 10 రకాల పంటల్లో 45 వెరైటీల వంగడాలకు సంబంధించి 15 వేల క్వింటాళ్ల విత్తనాలను విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే రైతుల సందేహాలు తీర్చడానికి శాస్త్రవేత్తలతో చర్చాగోష్ఠి ఏర్పాటు చేస్తున్నారు. రైతులు, యువరైతులు పెద్ద ఎత్తున పాల్గొని నాణ్యమైన విత్తనాలను సేకరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చెసుకొవాలి.