వరి పొలాల్లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్.
వరి సాగులో నీటి వాడకం అత్యధికం. నారు నాటిన తర్వాత నాలుగు నెలల వరకు నీరు తగ్గకుండా చూసుకోవాలి. అయితే సేంద్రియ పద్దతిలో సాగుచేసే వరి రైతులు చేపల సాగు చేసేలా ఇండోనేషియా రైతులు వినూత్న ప్రయత్నాలు సాగిస్తున్నారు. చేపలు, రొయ్యలు, బాతులను పెంచుతూ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ చేస్తున్నారు. దీంతో వరి పొలాల్లో ఆక్సిజన్ బాగా లభించి దిగుబడి 10%శాతం పెరుగుతుంది అలాగే పొలంలోని కీటకాలను చేపలు తినడం వల్ల కీటకాల సంఖ్య తగ్గుతుందంటున్నారు.