రాష్ట్రవ్యాప్తంగా ఆడపదడప వర్షాలు
తెలంగాణకు వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 5 రోజులపాటు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయన్నారు. గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ వర్షాలను దృష్టీలో ఉంటుకొని కాంటాలు కానీ వరి రైతులు తగు జాగ్రత్తలు తీసుకొవాలని, అలాగే లోతు దుక్కులు దున్నుకొవడం, పచ్చి రోట్ట పైర్ల వంటివి సాగు చేయడం వంటి పనులపై రైతులు దృష్టీ సారించాలి.