జూన్ రెండో వారంలో నైరుతి ఋతుపవనాలు
వాతావరణ శాఖ ఋతుపవనాలు గమనం పై బులిటెన్ ను విడుదల చేసింది. జూన్ 4 వ తేదీన కేరళలోకి నైరుతి ఋతుపవనాల ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో విస్తరించానికి దాదాపు వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందన్నారు. ఋతుపవనాలు ప్రవేశించడం ద్వారా ఎండలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది. చిరుజల్లులను చూసి తొందర పడి రైతులు విత్తనాలు విత్తుకుంటే భూమిలో మొలకలు ఉడికిపోయే అవకాశం ఉంది కావున విత్తనం విత్తే తేమ కనబడినప్పుడే విత్తనాలు విత్తుకొవాలని రైతులకు విజ్తప్తీ.