01 Jun , 2023

హైడ్రోపోనిక్ గ్రాసాలకు మస్త్ డిమాండ్

పౌల్ట్రీ, పాడి రంగాల్లో హైడ్రోపోనిక్ గ్రాసాల పై యజమానులు ఆసక్తీర చూపుతున్నారు. హైడ్రోపోనిక్ పశుగ్రాసం అంటే గోధుమ, మొక్క, జొన్న, బార్లీ వంటి గింజలను నేల లేకుండా, అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న నీటి ఆధారిత ద్రావణాలను ఉపయోగించి ఆకుపచ్చ గ్రాసంగా పెంచే పద్ధతి. నియంత్రిత వాతావరణంలో ధాన్యాలను మొలకెత్తించి, వారం లేదా అంతకంటే ఎక్కువ రోజుల్లో చిన్న మొక్కలుగా మారుతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు ఎంజైమ్‌ల అధిక మోతాదులో ఉంటాయి. అలాగే వాతావరణం లేదా సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా తాజా పచ్చి మేతను ఉత్పత్తి చేయగలవు. దీంతో పాడి రంగంలో పాల ఉత్పత్తి, పౌల్ట్రీ రంగంలో మాంసం ఉత్పత్తి పెరుగుతుంది.