03 Jun , 2023

భుసారానికి - పశువుల ఎరువు

ప్రస్తుతం ఖరిఫ్ పంట వేయడానికి సన్నద్దమవుతున్న రైతులు భూసారాన్ని పెంచడానికి సేంద్రియ ఎరువు భూ భౌతిక స్టితి మెరుగుపరచడానికి సరైనది. ఎకరాకు 10 టన్నులు (3ట్రాక్టర్లు) పశువుల ఎరువు వేస్తే ఫలితంగా సేంద్రియ పదార్ధం భూమిలో చేరి ఆరోగ్యంగా ఉండడమే కాక భూముల్లో నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది. నేలలో సారం పెరిగి పంట దిగుబడి అధికంగా లభిస్తుంది. చీడపీడల సమస్య తగ్గి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. ఎరువును చిమ్మించి మెట్ట దుక్కులు దున్నితే మరింత ప్రయోజనం ఉంటుంది. మెట్ట, మాగాణి భూములకు వర్షాలు కురవక ఒక ముందే పశువుల ఎరువు వేయాల్సి ఉంతుంది.