జూలై నెలలో రైతు బంధు
మరో వారం పది రోజుల్లో వానాకాలం ప్రారంభం కానుంది. ఇప్పటికే పలుచోట్ల రైతులు సాగుపనులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఎరువులు చల్లుకొవడం, దుక్కులు దున్నుకొవడం, విత్తనాల సేకరణ వంటి పనుల్లో ఉన్నారు. అయితే పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు ఖాతాల్లో పడటానికి ఇంకా మాసం రోజులు పట్టొచ్చని, కొత్త పాసుపుస్తకాలు ఎంట్రీ వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని సమాచారం. పెట్టుబడుల కొసం వడ్డి వ్యాపారులను ఆశ్రయించకుండా ఉండాలంటే పెట్టుబడి సాయం త్పరితగతినా అందించాలని రైతుల కొరుకుంటున్నారు.