ఖరీఫ్ సాగుకు పెరిగిన మద్ధతు ధరలు
2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ఈరోజు పెంచింది. సాధారణ వరి క్వింటాల్‌కు 143 రూపాయల మేర పెంచిన ధరతో కలిపి 2,183 రూపాయలుగా, పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి 8,558 రూపాయలుగా నిర్ణయించింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపు అన్నదాతలకు లాభయదాయకంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.