ఆకాశాన్ని అంటుతున్న అల్లం ధరలు....
10 రోజుల ముందు వరకు 100 రూపాయలకు అటు ఇటుగా ఉన్న అల్లం ధర ఒక్కసారిగా 150-200లకు పెరిగిపోవడంతో ఆ ప్రభావం రిటైల్ మార్కెట్లలోనూ కనిపిస్తోంది. ఈ ఏడాది డిమాండ్ కు సరిపడాపంట అందుబాటులోకి లేకపోవడంతో పాటు రవాణా ఖర్చులు అధికంగా ఉండటంతో ధరలు గణనీయంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రతీ వేసవికాలంలో లాగానే శొంఠి తయారీకి భారీగా అల్లాన్ని వినియోగించడం కూడా ధరలు పెరగడానికి కారణమని ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది మరియు రానున్నరోజుల్లో అల్లం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.