14 Jun , 2023

ఖాతాల్లోకి అకాల వడగళ్ళ వాన నష్టపరిహారం

మార్చి 16 నుంచి 21 వరకు తెలంగాణలోని 26 జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్లతో వరి, జొన్న, మిర్చి, వేరుసెనగ, పత్తి, కూరగాయలు, మామిడితోటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.151.46 కోట్ల పరిహారం విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులకు పంపించి, నేరుగా రైతుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీకి ఆదేశించారు. పంట నష్టాలను స్వయంగా పరిశీలించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారంగా అందిస్తామని. ఈ మేరకు వ్యవసాయశాఖ సర్వేలు నిర్వహించి 1,51,645 ఎకరాల నష్టాన్ని నమోదు చేసింది. దీనికి అనుగుణంగా 1,30,988 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేయాలని ఆదేశించింది. మహబూబాబాద్‌ జిల్లాలో 12,684 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం పరిహారం జమ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ ఒకటి రెండు రోజుల్లో పడనున్నాయని తెలిపారు.