15 Jun , 2023

పత్తి మోళ్లను కలియ దున్నితేనే భూమికి సత్తువ

పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు రాకుండా ఉండాలంటే సాగు భూమిలో వేసవి నుంచే ముందస్తుగా చర్యలు తీసుకోవాలని. పత్తి పంట దిగుబడి పూర్తయ్యాక చెట్ల మొదళ్లను అలాగే ఉంచుతున్నారు. అదే భూమిలో వానాకాలం పత్తి వేస్తే పురుగుల ఉద్ధృతి పెరుగుతుంది. పత్తి మోళ్లలో గుడ్లు, లార్వా కోశస్థ దశ రూపంలో నిల్వ ఉండే వానాకాలం పంట వేయగానే పురుగు ఆశించి నష్టపరుస్తుంది. పత్తి మోళ్లను ట్రాక్టర్ నాగలి లేదా రోటోవేటర్ లతో భూమిలో కలియదున్నాలి. పురుగు అవశేషాలను సమూలంగా నాశనం చేయవచ్చు. తద్వారా సేంద్రియ కర్బన పదార్థాలను అందించి భూమి సత్తువను పెంచుకోవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు.