రైతులు నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా ?
రైతులు విత్తనం తీసుకునేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. ప్రభుత్వ అనుమతి పొందిన లేదా విత్తన ధృవీకరణ సంస్థ లైసెన్సు పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనాలి. 2. తక్కువ ఖరీదు ఉన్న, మూటలలో కట్టిన విత్తనాలను కొనవద్దు మరియు కొనుగోలుదారు నుండి బిల్లును తీసుకోవాలి. 3. విత్తనాలు కొంటున్నపుడు సంచి వెనకాల ట్యాగ్ లు, లైసెన్స్ నెంబర్, విత్తనం, లాట్ నెంబర్, QR కోడ్ వీటితో పాటు "Date of packing" మరియు "Validity Dates" కూడా రైతులు సరి చూసుకోవాలి. 4 మొలక శాతం 80% అంత కంటే ఎక్కువగా ఉండేలా, జన్యు శాతం 98% అంతకంటే ఎక్కువగా మరియు ఇతర పదార్థాలు 2% అంతకంటే తక్కువగా ఉండేలా రైతులు సరిచూసుకోవాలి. 5. ఒకవేళ ప్రత్తి విత్తనాలు కొంటున్నప్పుడు బీటీ మరియు నాన్ బీటీ విత్తనాల తేడా కోసం "GEAC" చే ముద్రించిన నంబర్ ఉన్నది లేనిది రైతులు గుర్తించాలి. నంబర్ ఉంటే బిటి విత్తనాలు గా గుర్తించాలి.