కొత్త రకం సాగు విస్తరణకు రైతులు ఆసక్తి !!
వరి, పత్తి లాంటి పంటలకి పరితమైన రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలపై ఆసక్తి చూపుతున్నారు. నూతన వ్యవసాయ పద్దతులను పాటిస్తూ తక్కువ శ్రమతో అధిక దిగుబడి వచ్చేలా నూతన వంగడాలను సాగు చేసేందుకు మొగ్గుచుపుతున్నారు. అందరు పండించే పంటలు కాకుండా భిన్నంగా, డిమాండ్ ఉండే కూరగాయలను, పండ్లను మరియు తృణ ధాన్యాలను కొత్త మార్గాలతో పండించి లాభాలు పొందడానికి మొగ్గుచుపుతున్నారు. ఆయిల్ పామ్, డ్రాగెన్ ఫ్రూట్, పసుపు రంగు మిర్చి, చిరు ధాన్యాలు మొదలగు పంటలను పండించడం వలన నీరు వినియోగం తక్కువ అవడంతో పాటు అధిక దిగుబడిని పొందుతారు.