స్మార్ట్ ప్యాకేజింగ్ - రంగు మారితే పాడైనట్టే !
మనం ఏదైనా ఆహార పదార్దాలను కొనేటప్పుడు వాటి నాణ్యత మరియు ఎంతకాలం నిల్వ ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక కొత్త ప్యాకేజ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఆహార నాణ్యతను ప్యాక్ లోపల ఉండే పదార్దాల నాణ్యతను గుర్తించేలా స్మార్ట్ ప్యాకేజింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పాలపై చేసిన అధ్యయనం ఆధారంగా లాక్టోబాసిల్లస్ పెరుగుదలను బట్టి ప్యాకేజ్ లేబుల్ పైన ఉండే క్వాలిటీ ఇండికేటర్ రంగు మారిపోయేలా, దీంతో పాల నాణ్యత ప్యాకెట్ లోపల, బయట ఏర్పాటు చేసిన ఇండికేటర్లు నాణ్యత సూచికలుగా పనిచేస్తాయి. ఆహార నాణ్యతను బట్టి లేబుల్ ఇండికేటర్ రంగులో మార్పులు వస్తాయి. దీని ద్వారా కొనుగోలు చేయకముందే నాణ్యతను తెలుసుకోవచ్చు. ప్యాక్ కవర్ లోపల ఉండే మెంబ్రేన్ ఫిల్టర్ గా పనిచేసి ఆహారంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించి ఇండికేట్ చేస్తుంది.