21 Aug , 2023

మిల్లెట్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ !!

ఆంధ్రప్రదేశ్ చిరుధాన్యాల దిగుబడిలో మొదటిగా మరియు ఎగుమతుల్లో ఏడవ స్థానంలో నిలిచిందని నాబార్డు నివేదికలు విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం ధాన్యాలను డిమాండ్ ఆధారంగా దేశీయ, అంతర్జా తీయ మార్కెట్కు ఎగుమతి చేయటంతో పాటు రాష్ట్ర స్థాయిలో పాఠశాలలు, హాస్టళ్లలో పోషకాహారం కింద వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రపంచ మార్కెట్లలో భారతీయ మిల్లెట్లను ప్రోత్సహించడానికి స్టార్టప్లు, అకడమిక్ రీసెర్చ్ సంస్థలు, భారతీయ మిషన్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, ఎగుమతిదారులతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్ (ఈపీఎఫ్) ను ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది. ఐక్యరాజ్యసమితి 2023 ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణ పై దృష్టి కొనసాగించాలని, చిరుధాన్యాల సాగులో జొన్నలు, సజ్జలను అధికంగా పండిస్తుండ గా సామలు, అరిక, రాగులు, కొర్రలు, వరిగ, ఊద ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.