డ్రాగన్ ఫ్రూట్- తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం !!
డ్రాగన్ ఫ్రూట్ పంటపై ఈమధ్య చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉండటమే కాక అధిక హెల్త్ బెనిఫిట్స్ ఉండటం వల్ల ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ను ప్రజలు తినడానికి ఇష్టపడుతున్నారు. తినేవారితో పాటు పండించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఈ పంటను పండించడానికి ఎక్కువ నీరు అవసరం లేదు. పంట నిర్వహణ- ఫ్రూట్ ప్యాకింగ్, మార్కెటింగ్, ఎగుమతి కూడా చాలా సులభం. ఇలా సాగు ఖర్చు తక్కువ ఉండడంతో చాలా మంది రైతులు పండించడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.