వర్షాలకు పత్తిలో చేపట్టాల్సిన చర్యలు !!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాగు అయ్యే పత్తి వర్షాభావ పరిస్థితుల వలన పంట బెట్టకు వచ్చింది. పత్తి పంట ప్రస్తుతం పూత దశ నుంచి కాయ పక్వానికి వచ్చే దశలో ఉంది. 1. బెట్ట పరిస్థితుల నుంచి పంటను కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13.0.45) లేదా 20 గ్రాముల యూరియాను లీటరు నీటిలో కలుపుకొని - వారం వ్యవధిలో రెండుసార్లు పంటపై పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. 2. తెగులు (ఆకులు) ఎర్రబడటం కనిపిస్తే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13, 0, 45) తోపాటు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మొదటి పిచికారీ చేసిన నాలుగు రోజుల తర్వాత ఐదు గ్రాముల సూక్ష్మపోషకాల మిశ్రమం (ఫార్ములా 4) ను లీటరు నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారి చేసుకోవాలి. 3. బెట్టితో పూత ఎండిపోయి రాలినట్లు గమనిస్తే లీటరు నీటికి 1.5 గ్రాముల బోరాక్స్ ను కలుపుకొని వారం వ్యవధిలో పైపాటుగా రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. ఇది కాయ వృద్ధికి తోడ్పడుతుంది.