పండ్ల పై స్టిక్కర్లు ఎందుకు అతికిస్తారు ?
మనం పండ్లు కొనే సమయంలో వాటిపై స్టిక్కర్లు ఉండటం గమనిస్తూ ఉంటారు. అసలు స్టిక్కర్లను ఎందుకు అతికిస్తారు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఆ స్టిక్కర్ల ద్వారా ఆ పండును ఏ విధంగా పండించారో మనం సులభంగా తెలుసుకోవచ్చు. 3 లేదా 4 నంబర్ తో మొదలైన స్టిక్కర్ సహజసిద్ధమైన ఎరువులు మరియు కెమికల్స్ సహాయంతో రెండు విధాలుగా పండించిన పండ్లకు మాత్రమే వేస్తారు. ఒకవేళ పండ్లపై ఉన్న స్టిక్కర్ 9 అనే నంబర్ తో మొదలు పెడితే వాటిని సహజసిద్ధంగా పండించారని అర్థం చేసుకోవాలి. సేంద్రీయ ఎరువులతో సహజసిద్ధంగా పండించినవి కావున ఇలాంటి పండ్లను తినడం మంచిది. పండ్లపై ఉన్న స్టిక్కర్ పై సంఖ్య 8 అనే నంబర్ తో మొదలైతే మాత్రం జన్యు మార్పిడి ద్వారా ఆ పండ్లను పండించారని అర్థం చేసుకోవాలి.అలాంటి పండ్లను తినకపోవడమే మంచిది.