పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్దం !!
ఈ వానాకాలం సీజన్‌లో పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సంస్థ సిద్ధమైంది. పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సీజన్‌లో 1.09 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. దాదాపు 10 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లులున్న 9 చోట్ల కాటన్ సీసీఐ ద్వారా ఈ నెల చివరి వారం నుంచి కొనుగోళ్లు చేపట్టనున్నది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.7,020గా ప్రకటించింది. అయితే తక్కువ ధరకు దళారులకు అమ్మి మోసపోవద్దని, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని అధికారులు పత్తి రైతులకు సూచిస్తున్నారు.