ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు - 1 !!
1. ప్రస్తుతం మామిడి తోటలు సగభాగం పచ్చ పూత కొంత తెల్ల పూత మరియు కొంత భాగం ఇంకా మొట్టెలతోటి (పూ మొగ్గ దశ లో) పూత విచ్చుకోకుండా ఉన్నది ఇలాంటి పరిస్థితులలో తోటలకు తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. 2. పిందె పూత రాలిపోవడనికి నీటి మరియు పోషక లోపమే కారణము. డ్రిప్పు పైపుల అమర్చే పద్దతి కూడా ఉత్పత్తి పై ప్రభావం చూపిస్తుంది. మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉండటంవల్ల పూత పిండే పై ప్రభావం చూపిస్తుంది. నీటి తడులు ఇచ్చేటప్పుడు మొదటి రెండు తడులు తేలికగా ఇచ్చిన తర్వాత మాత్రమే మూడోతడి పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది లేని పక్షంలో పూత గాని పిందే గాని రాలిపోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. 3. చెట్టుకు తెల్ల మరియు పచ్చ పూత కంటే మొట్టెలే (పూ మొగ్గలు) అధికంగా ఉంటే మల్టీ-కే (13-0-45) 5 కేజీ.+సూక్ష్మ పోషక మిశ్రమం 2.5 కేజీ.+ ప్లానోఫిక్స్ 100మి.లీ/ 500 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. డి. చక్రపాణి, జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి వికారాబాద్ జిల్లా.