మానవ వ్యర్దాలతో జీవన ఎరువు, విద్యుత్తు తయారి !!
ప్రపంచవ్యాప్తంగా జీవన ఎరువుల తయారికి, పునరుత్పాదక ఇంధనాలకు డిమాండ్ పెరుగుతున్నవేళ కేరళలోని ఐఐటీ పాలక్కడ్ పరిశోధకులు మానవ మూత్రం నుంచి విద్యుత్తు, జీవఎరువును ఉత్పత్తి చేసే వినూత్న ఆవిష్కరణ చేపట్టారు. మూత్రంలోని అయానిక్ శక్తిని ఉపయోగించుకొని ఎలక్ట్రోకెమికల్ చర్యలను ప్రేరేపిస్తుంది. దానివల్ల విద్యుత్తు ఉత్పత్తవుతుంది. తర్వాత అదే మూత్రం నుంచి- నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం అధికంగా ఉన్న జీవఎరువు కూడా తయారవుతుంది. ఈ విధానంలో ఉత్పత్తయిన విద్యుత్తును మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు, ఎస్ఈడీ బల్బులను వెలిగించేం దుకు ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు