29 Feb , 2024

రెండవసారి రికార్డ్ స్థాయి ధరలో పసుపు

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పసుపు పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన పన్నాల మహిత అనే మహిళా రైతుకు చెందిన 17 క్వింటాళ్ల కొమ్ముకు గరిష్ఠంగా క్వింటాకు రూ.14255 చొప్పున ధర పలికింది. ఇదే ఈ సీజన్ అత్య ధిక ధరగా మార్కెటింగ్ సెలక్షన్ గ్రేడ్ కార్య దర్శి వెంకటేశం వెల్లడించారు.2011లో క్వింటా ఆల్టైమ్ రికార్డు ధర రూ.16,166 పలికింది. ఆ తర్వాత రూ.6-7 వేల మధ్య మాత్రమే లభిస్తోంది.