గుజరాత్ లో జరిగిన అంతర్జాతీయ మిల్లెట్స్ మహోత్సవం....
2023 ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. తగ్గుతున్న చిరు ధాన్యాల పంటల సాగును తిరిగి పెంచేందుకు, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పోయిన సంవత్సరం, చిరు ధాన్యాలయినా రాగులు, సజ్జలు, జొన్నలు మొదలగు పంటల ఉత్పత్తిని పెంచేందుకు మరియు వాటి వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇదే క్రమంలో, గుజరాత్ అహ్మదాబాద్ లో గల సబర్మతి రివర్ఫ్రంట్ గ్రౌండ్ లో 2024 మిల్లెట్ మహోత్సవ కార్యక్రమం మార్చ్ 1, 2 తేదిలలో జరిగింది. చిరు ధాన్యాలను అనేక దుకాణాలలో ముఖ్య ఆకర్షణగా, మిల్లెట్స్ తో తయారు చేసిన అనేక పిండి వంటలను ఫుడ్ స్టాల్స్ను ప్రదర్శనలో ఉంచారు.