రైతులు విత్తన కొనుగోళ్లలో మోసపోవద్దు....
మిరప రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో తొందరపడి యూ ట్యూబ్ ఛానల్స్ లేదా ఇతర రైతులతో 40క్వింటలు అదిగో 30క్వింటలు ఇవిగో అని మాట్లాడించి చెప్పే మాటలు నమ్మకండి. అడ్వాన్స్ డబ్బు ఇచ్చి మోసపోకుండా ఏ నేలలో ఏ రకం బాగా పండుతుందో అంచనా వేసుకొని తీసుకోవడం మంచిది. ఏ f1 వెరైటీలలో నైనా 2 లేదా 3క్వింటాల తేడా ఉంటుంది అన్నీ వెరైటీ లు బాగానే ఉంటాయి. ఇది మనకు తెలియని విషయం కాదు. మీరు తీసుకోవాలనుకున్న విత్తనాల కంపెనీ కి R&D సర్టిఫికెట్ ఉందా లేదా బిల్, బ్యాచ్ నెంబర్, డీలర్ సంతకం ఉండేటట్లు చూసుకొని తీసుకోండి. రైతులు వాతావరణ మరియు వారి నేల రకం ఆధారంగా గమనించి తొందర పడకుండా తొలకరి తర్వాతనే విత్తన కొనుగోలు చేసుకోవాలి.